ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఓ డిగ్రీ కళాశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జూనియర్ కళాశాల, గిరిజన వసతి గృహ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేక్ కట్ చేశారు.
కేసీఆర్ మత సామరస్యానికి ప్రతీక: సత్తుపల్లి ఎమ్మెల్యే - ఖమ్మం జిల్లా సత్తుపల్లి
సీఎం కేసీఆర్ మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాలను గౌరవిస్తారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొనియాడారు. సత్తుపల్లిలోని ఓ డిగ్రీ కళాశాలలో ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా హరితహారం చేపట్టారు.
కేసీఆర్ మత సామరస్యానికి ప్రతీక: సత్తుపల్లి ఎమ్మెల్యే
కేసీఆర్ రైతుబంధు రైతు బీమా సౌకర్యం కల్పించి రైతాంగాన్ని ఆదుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాలను గౌరవిస్తారని కొనియాడారు.
ఇవీ చూడండి:లవ్ ఫెయిల్ అంటూ బైక్పై అతివేగం.. గాల్లో ప్రాణాలు