తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు: భట్టి

తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు ఇప్పటికే రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు.

clp leader bhatti vikramarka
భట్టి విక్రమార్క

By

Published : Apr 3, 2021, 9:26 PM IST

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగానే ఉందని చెప్పారు.

బడుగుబలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శంచారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం అందినకాడికి దోచుకుంటుందని ధ్వజమెత్తారు. తెలంగాణ యువత మేధావులు రాష్ట్ర పరిస్థితులపై ఆలోచించాలని సూచించారు.

ఇదీ చదవండి:సీఎం కేసీఆర్​ను కలిసిన కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details