ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కల్యాణలక్ష్మీ, షాదీ ముబాకర్ పథకం నిరుపేద మహిళలకు కొండంత అండనిస్తోందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 110 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. ఒక్క ఖమ్మం నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు దాదాపు 2 వేల మహిళలకు ఇంటింటికీ వెళ్లి చెక్కులు పంపిణీ చేయడం గర్వంగా ఉందని తెలిపారు. త్వరలోనే మళ్లీ ఇంటింటికీ తిరిగి చెక్కులు పంపిణీ చేస్తామన్నారు.
ఖమ్మంలో ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ - puvvada ajaykumar
ఎన్నికల కోడ్ అనంతరం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద చెక్కులను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ