యువజన దినోత్సవం పురస్కరించుకుని.. ఖమ్మం జిల్లా జన్నారంలో పేద విద్యార్థులకు చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివేకనంద సేవాసమితి నాయకులు మోతుకూరి నారాయణరావు పాల్గొని విద్యాభివృద్ధికి చేతన ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
సద్వనియోగం చేసుకుని..
జన్నారంలో పేద విద్యార్థులకు రూ.4 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసినట్లు చేతన పౌండేషన్ సభ్యులు తెలిపారు. విద్యార్థుల ఆన్‌లైన్ తరగతులతోపాటు, సాంకేతికవిద్యకు తోడ్పడేందుకు వీటిని అందించామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల ఈ సేవలను సద్వనియోగం చేసుకుని.. మంచి ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యాభివృద్ధికి చేతన ఫౌండేషన్ చేస్తున్న సేవలను పలువురు అభినందించారు.
ఇదీ చదవండి:కాగితాలపైనే వ్యాపారాలు.. అక్రమార్కుల జేబుల్లోకి కోట్ల రూపాయలు