ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదంటూ రైతులు నిరసన తెలిపారు. పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందని పోలీసులు 13 మంది అన్నదాతలపై కేసు నమోదు చేశారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి తమపై కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని రైతులు వాపోయారు.
ఆందోళన చేసిన రైతన్నలపై కేసులు - ఖమ్మం రైతులు
ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై రైతులు రోడ్డెక్కారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందని పోలీసులు 13 మంది అన్నదాతలపై కేసులు నమోదు చేశారు.
ఖమ్మం రైతులు