ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వ్యాపారి పల్లెపోతు చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌లో ఓ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల రేజర్ల మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి మామిడి తోటలోకి దూసుకెళ్లింది.
డ్రైవర్ నిద్రమత్తులో... కారు మామిడి తోటలో... - CAR ACCIDENT IN KHAMMAM
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లలో ఓ కారు అదుపుతప్పి మామిడి తోటల్లోకి దూసుకుపోయి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
డ్రైవర్ నిద్రమత్తులో... కారు మామిడి తోటలో...
ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌తో పాటు అతని భార్య సునీత పిల్లలు జస్వంత్, సాయి, శ్రీనిధి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సత్తుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!
TAGGED:
CAR ACCIDENT IN KHAMMAM