సహకార ఎన్నికల్లోనూ అధ్యక్ష ఎన్నికకు క్యాంపు రాజకీయాలు తప్పటంలేదు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో గెలుపొందిన అభ్యర్థులను నేతలు ప్రత్యేక వాహనాలలో ఇతర ప్రాంతాలకు తరలించారు. సొసైటీలోని 13 వార్డులకు గాను... తెరాస, సీపీఎం పొత్తులో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 6 స్థానాల్లో గెలుపొందారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ సమీకరణాలు మారుతాయేమోనన్న భయంతో నేతలు క్యాంపులకు తీసుకెళ్లారు.
సహకార సంఘ ఎన్నికల్లోనూ క్యాంపు రాజకీయాలు
ప్రభుత్వాలు నిలబెట్టుకునేందుకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో జరిగే క్యాంపు రాజకీయలు.. నేడు సహకార సంఘ ఎన్నికల్లోనూ తారసపడ్డాయి. అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు పొత్తు పెట్టుకున్న ఇతర పార్టీ మద్దతుదారులను క్యాంపులకు తరలించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరులో జరిగింది.
ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి అభ్యర్థులను తరలించే క్రమంలో స్వల్ప తోపులాటలు చోటు చేసుకున్నాయి. శిబిరానికి వెళ్తున్న అభ్యర్థులను తమ ప్రాంత కార్యకర్తలు చూసేందుకు పెద్దసంఖ్యలో తరలించారు. అభ్యర్థులు బయటకు రాగానే ఒక్కసారిగా కార్యకర్తలు తోసుకుని రాగా... పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీపీఎం అభ్యర్థులతో శిబిరానికి తమ పార్టీ వారిని రానివ్వకపోవటం వల్ల కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ క్రమంలో పోలీసులు లాఠీలు జుళిపించాల్సి వచ్చింది.
ఇవీ చూడండి:శంషాబాద్లో 1100 గ్రాముల బంగారం పట్టివేత