BRS Praja Ashirvada Sabha at Khammam Today : ఖమ్మం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలే స్వయంగా చూశారని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Puvvada Ajay Kumar) కృషితోనే ఖమ్మం అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)లో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు.
పువ్వాడ పువ్వులు కావాలా..? తుమ్మల తుప్పలు కావాలా..? అంటూ వ్యంగ్యంగా సీఎం కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. తుమ్మలను గెలిపిస్తే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయి.. ఇక మీ ఇష్టమని ఖమ్మం ప్రజలకు హితవు పలికారు. ప్రభుత్వ విజన్.. పువ్వాడ మిషన్‌తో ఖమ్మం అభివృద్ధి సాధ్యమైందని గర్వంగా చెప్పారు. వాడవాడలో పువ్వాడ అని పత్రికల్లో వార్తలు వచ్చేవని గుర్తు చేశారు. రూ.700 కోట్లు చేసి ఈ జిల్లాను పువ్వాడ అభివృద్ధి చేయించారని వివరించారు. పువ్వాడను గెలిపిస్తే మళ్లీ మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని హామీ ఇచ్చారు.
'50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాని పనులు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసింది'
CM KCR Participate BRS Public Meeting : కేసీఆర్ బతికి ఉన్నంత వరకూ తెలంగాణ లౌకిక రాజ్యంగానే ఉంటుందని బీఆర్‌ఎస్ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయి మూలనపడి ఉంటే.. తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswararao) ను పిలిచి మంత్రి పదవి ఇచ్చానని చెప్పారు. తుమ్మల వల్ల ప్రజలకు జరిగిన మేలు శూన్యమన్నారు. ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేస్తానని ఓ అర్భకుడు అంటున్నారని మండిపడ్డారు. ఏమైనా ఖమ్మం జిల్లాను ఆయన గుత్తకు తీసుకున్నారా అంటూ ధ్వజమెత్తారు. రాబోయే కాలమంతా ప్రాంతీయ పార్టీలదే(Regional Parties) అని కేసీఆర్ తెలిపారు.