తెలంగాణ

telangana

ETV Bharat / state

బిహార్​ కార్మికుల కష్టాలు.. ఆదుకోండంటూ వినతి - ఖమ్మం తాాజా వార్త

పొట్టకూటి కోసం బిహార్​ ప్రాంతం నుంచి వచ్చి ఖమ్మంలోని గ్రానైట్​ ఫ్యాక్టరీలో కొంత మంది కార్మికులు పనులు చేస్తున్నారు. కానీ లాక్​డౌన్​ కారణంగా పనుల లేక.. తినడానికి తిండిలేక తాము నానా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

bihar migrants difficulties in khammam
బీహార్​ వలస కార్మికుల కష్టాలు.. ఆదుకోండంటూ వినతి

By

Published : Apr 25, 2020, 8:04 PM IST

పొట్ట చేత పట్టుకొని పని కోసం రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చామని.. లాక్​డౌన్ కారణంగా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నామని ఖమ్మంలో ఉంటున్న బిహార్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పారిశ్రామిక ప్రాంతం, గ్రానైట్ ఫ్యాక్టరీలో సుమారు 60 మంది బిహార్ నుంచి వచ్చిన కార్మికులు పని చేస్తున్నారు. కొంతకాలంగా తమ వద్ద ఉన్న డబ్బులు అయిపోయాయని.. తెచ్చుకున్న సరుకులు ఖాళీ అయ్యాయని వారు వాపోయారు.

దాతలు రోజులో ఒక్క సారి భోజనం పెడుతున్నారని మిగిలిన పూటలు తాము పస్తులు ఉంటున్నామంటూ వారి గోడు వెల్లబుచ్చుకున్నారు. ఆకలికి తట్టుకోలేకపోతున్నామని తమకు ఎవరైనా సాయం చేయండంటూ వలస కూలీలు వేడుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తామని బీహార్​కు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?

ABOUT THE AUTHOR

...view details