తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో కొనసాగుతున్న బంద్​.. పలు పార్టీల మద్దతు

భారత్‌ బంద్‌కు ఖమ్మంలో సంపూర్ణ మద్దతు లభించింది. కాంగ్రెస్‌, వామపక్షాలు, తెదేపా ఆధ్వర్యంలో బస్‌డిపో, బస్టాండ్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్​ చేశారు.

Bharath Bandh at khammam, Bharath Bandh news
ఖమ్మంలో భారత్‌ బంద్, కాంగ్రెస్‌, వామపక్షాలు, తెదేపా

By

Published : Mar 26, 2021, 12:53 PM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్‌ బంద్‌కు ఖమ్మంలో సంపూర్ణ మద్దతు లభించింది. కాంగ్రెస్‌, వామపక్షాలు, తెదేపా ఆధ్వర్యంలో ఉదయం నుంచి ఆందోళనలు చేపట్టారు. బస్‌డిపో ఎదుట ధర్నా నిర్వహించి.. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.

అనంతరం ఖమ్మం బస్టాండ్‌ ఎదుట బైఠాయించారు. నగరంలో కొన్ని దుకాణాలు స్వచ్ఛందంగా బంద్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా 346 బస్సుల్లో 136 బస్సులు తిరుగుతున్నాయి.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్‌, సీపీఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాయల చంద్రశేఖర్‌, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'సాగు కూలీలకూ రైతు బీమా వర్తింపుపై నిర్ణయం తీసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details