భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు నేరుగా భక్తులకు చేరేలా భద్రాచలం దేవస్థానం ఏర్పాటు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా సీతారాముల కల్యాణం ఆలయం లోపల భక్తులు లేకుండా నిర్వహించారు. అయితే భక్తులకు ఈ తలంబ్రాలు నేరుగా ఇంటివద్దకే పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
భక్తులకు నేరుగా రామయ్య కల్యాణ తలంబ్రాలు - భద్రాచలం దేవస్థానం
భద్రాద్రి రామయ్య కల్యాణం ప్రత్యక్షంగా వీక్షించేలేని భక్తులకు భద్రాచలం దేవస్థానం కొత్త ఏర్పాటు చేసింది. రామయ్య కల్యాణ తలంబ్రాలను నేరుగా భక్తులకు చేరేలా కార్యాచరణ రూపొందించారు. అందుకోసం చరవాణిలో టీ యాప్, పోలియో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఆలయ అధికారులు.
భక్తులకు నేరుగా రామయ్య కల్యాణ తలంబ్రాలు
చరవాణిలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీ యాప్, పోలియో యాప్ను డౌన్లోడ్ చేసుకొని.. అందులో పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆలయ అధికారులు తెలిపారు. నమోదు అనంతరం తలంబ్రాలు పొందవచ్చన్నారు. రెండు ముత్యాలు గల ఒక తలంబ్రాల ప్యాకెట్ రూ. 20కు అందిస్తున్నామని.. ఒక్కొక్కరికి రెండు ప్యాకెట్లు మాత్రమే పంపిస్తామని పేర్కొన్నారు. పోస్టల్ ఛార్జీలు అదనంగా ఉంటాయని వెల్లడించారు.
ఇదీ చూడండి:ఐఏఎస్ అధికారికి కరోనా- ప్రభుత్వం అప్రమత్తం