వైరాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం - khammam
ఎండతీవ్రత నుంచి ఖమ్మం వాసులకు కాస్తా ఉపశమనం లభించింది. ఉదయం నుంచే వైరాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
భారీ వర్షం
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఉదయాన్నే బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. కొన్ని చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలుల ప్రభావంతో చేపల వేటను అధికారులు రద్దు చేశారు.