తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్టీ మారాడని కక్ష..! రుణం చెల్లించలేదని రైతు ఇంటికి తాళం.. - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు డీసీసీబీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న రుణం కట్టలేదని... ఇళ్లకు తాళాలు వేయడంతో పాటు పంట భూములను వేలం వేసేందుకు జెండాలను సైతం ఏర్పాటు చేయడంతో ఆందోళన చెందుతున్నారు.

Bhukya Lakshman
భూక్య లక్ష్మణ్

By

Published : Mar 25, 2022, 12:22 PM IST

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగూడెం గ్రామానికి చెందిన భూక్య లక్ష్మణ్ ఏడు సంవత్సరాల క్రితం ఇల్లందు డీసీసీబీలో రూ. 5.30లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పటి నుంచి వాయిదాల్లో భాగంగా రూ.7లక్షలకు పైగా బ్యాంకుకు చెల్లించారు. ఇంకా అప్పు చెల్లించాలంటూ అధికారులు బాధిత రైతుకు నోటీసులు అందచేశారు.

అంతటితో ఆగక అధికారులు రుణాలు కట్టాలంటూ ఇంటికి తాళం వేశారు. అదేవిధంగా పంట భూమిని వేలం వేసేందుకు జెండాలు సైతం ఏర్పాటు చేశారు. ఇదంతా రాజకీయ కక్షతోనే ఓ వర్గం తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని లక్ష్మణ్ వాపోయారు.

ఇదీ చదవండి: Land Pooling: ల్యాండ్‌ పూలింగ్‌పై భిన్నాభిప్రాయాలు.. వాటా తేల్చాకే నిర్ణయమన్న రైతులు

ABOUT THE AUTHOR

...view details