ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సింగరాయపాలెంలోని ఓ ఇంట్లో 100 లీటర్ల నిషేధిత కలుపు మందు డబ్బాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న కొనిజర్ల ఏవో బాలాజీ.. తమ సిబ్బందితో కలిసి ఇంటిపై దాడులు నిర్వహించారు. అప్పటికే 70 లీటర్ల మందులు విక్రయించగా.. మిగిలిన 30 లీటర్ల మందు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత కలుపు మందులను స్వాధీనం చేసుకున్న అధికారులు - ఖమ్మం జిల్లా తాజా నేర వార్తలు
ఖమ్మం జిల్లా సింగరాయపాలెంలో నిషేధిత కలుపు మందులను వ్యవసాయశాఖ అధికారులు పట్టుకున్నారు. సుమారు 30 లీటర్ల మందు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత కలుపు మందులను స్వాధీనం చేసుకున్న అధికారులు
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి: 35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్