తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరాలో అకాల వర్షం... రోడ్లన్నీ జలమయం - rain

అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క రోడ్లన్నీ జలమయం అవుతుండగా.. మరోవైపు ధాన్యం తడిసి ముద్దవుతోంది.

అకాల వర్షం

By

Published : Apr 22, 2019, 10:51 PM IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులు కమ్ముకొని ఒక్కసారిగా వర్షం పడటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులకు ఈ వర్షం కన్నీరు తెప్పిస్తోంది. వైరా కొనగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిచాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనగోలు చేసి ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు.

అకాల వర్షం

ABOUT THE AUTHOR

...view details