ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం బొంబాయి తండాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నడిచివెళ్తున్న మహిళను వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో భూక్యా క్రాంతి అనే మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మేడారం నుంచి ఇల్లందు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనకు అతివేగమే కారణమని ఎస్సై తెలిపారు. కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బొంబాయి తండాలో కారు ఢీకొని మహిళ మృతి - road accident at ellandu
ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం బొంబాయి తండాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నడిచివెళ్తున్న మహిళను అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
బొంబాయి తండాలో కారు ఢీకొని మహిళ మృతి