తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాధలకు బట్టలు పంపిణీ చేసిన మానవతావాది - ఖమ్మం జిల్లా వార్తలు

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ మానవతావాది.. స్థానిక అన్నం సేవా ఫౌండేషన్ అనాధాశ్రమంలో అన్నదానం చేశారు. తన తండ్రి వర్ధంతి సందర్భంగా.. ఆశ్రమ వాసులకు బట్టలు పంపిణీ చేశారు.

donated clothes to orphans
అనాధాశ్రమంలో అన్నదానం

By

Published : May 27, 2021, 10:28 PM IST

అనాధాశ్రమంలో అన్నదానం

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ వ్యక్తి.. స్థానిక అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తన తండ్రి వర్ధంతిని పురస్కరించుకుని.. 332 మంది ఆశ్రమ వాసులకు బట్టలు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఫౌండేషన్​ సభ్యులు.. దాతకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

అనాధలకు అండగా

స్థానికుడు ఫణిభట్ల శివరామకృష్ణ.. తన తండ్రి వెంకటాద్రి 49వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమవాసులకు నిత్యం అండగా నిలవడమే కాకుండా.. విపత్కర పరిస్థితుల్లో కరోనా మృతులకు దహన సంస్కారాలు నిర్వహిస్తూ సామాజిక బాధ్యతగా ముందుకు సాగుతున్నారు.

ఆపదలో ఉన్న వారికోసం రూ. 5 లక్షలు ఖర్చు చేసి అంబులెన్స్​ను ఏర్పాటు చేయించారు. కష్ట కాలంలో మానవతవాదులంతా ముందుకొచ్చి పేదలకు అండగా నిలవాలని శివరామకృష్ణ కోరుతున్నారు.

అనాధలకు అండగా

ఇదీ చదవండి:JUDA's: సమ్మె విరమించిన జూనియర్‌ డాక్టర్లు

ABOUT THE AUTHOR

...view details