తెలంగాణ

telangana

ETV Bharat / state

20 వేల తీసుకుంటూ అనిశాకి చిక్కిన లైన్ ఇన్​స్పెక్టర్ - 20 వేల తీసుకుంటూ అనిశాకి చిక్కిన లైన్ ఇన్​స్పెక్టర్

ఖమ్మం జిల్లా కేంద్రంలో 20 వేల లంచం తీసుకుంటూ లైన్ ఇన్​స్పెక్టర్​ అనిశా అధికారులకు చిక్కాడు.

acb
20 వేల తీసుకుంటూ అనిశాకి చిక్కిన లైన్ ఇన్​స్పెక్టర్

By

Published : Dec 7, 2019, 5:29 PM IST

ఖమ్మంలో అవినీతికి పాల్పడుతూ ఓ ఉద్యోగి అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. ధ్వంసలాపురం విద్యుత్ ఉప కేంద్రంలో లైన్ ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న సిజాఉద్దీన్ ఓ అపార్ట్ మెంట్​కు సంబంధించిన ట్రాన్స్​ఫార్మర్ అమర్చేందుకు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని అపార్ట్​మెంట్ యజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన అధికారులు ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకునేందుకు పథకం పన్నారు. యజమాని 20 వేలు ఇస్తానని చెప్పి ఒప్పుకొని డబ్బు ఇస్తుండగా... అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​లోని ఎసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

20 వేల తీసుకుంటూ అనిశాకి చిక్కిన లైన్ ఇన్​స్పెక్టర్

ఇవీ చూడండి: అత్యాచార నిందితుడిపై న్యాయవాదుల దాడి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details