తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజన్న రాజ్యం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం' - సంకల్ప సభ గోడపత్రిక ఆవిష్కరణ

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్​ షర్మిల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వైఎస్​ఆర్​ పార్టీ అభిమానులు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించబోయే సంకల్ప సభ గోడ పత్రికను వైఎస్​ఆర్​ పార్టీ జిల్లా బాధ్యుడు అక్కినపల్లి కుమార్​ ఆవిష్కరించారు.

wall poster, ysr
ys sharmila, karimnagar, goda patrika

By

Published : Mar 27, 2021, 7:56 PM IST

ఏప్రిల్​ 9న ఖమ్మం జిల్లాలో వైఎస్​ షర్మిల నిర్వహించనున్న సంకల్ప సభ గోడ పత్రికను ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వైఎస్​ఆర్​ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. కరీంనగర్​ పట్టణంలోని ప్రెస్​క్లబ్​లో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా బాధ్యులు అక్కినపల్లి కుమార్​, డాక్టర్​ నగేశ్​ పాల్గొన్నారు.

రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు వైఎస్​ షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. షర్మిల సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. షర్మిల స్థాపించబోయే నూతన పార్టీకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అండగా ఉంటారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అభివృద్ధిలో శాంతిభద్రతల పాత్ర కీలకం: మంత్రి మహమూద్ అలీ

ABOUT THE AUTHOR

...view details