కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కరోనా నివారణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ మున్సిపల్, ఆస్పత్రి సిబ్బందిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల నిరసన - muncipal employees
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పలువురు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ మున్సిపల్, ఆస్పత్రి సిబ్బందిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కొవిడ్-19 నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కార్మికులకు 25వేలు అదనంగా పారితోషికం ఇవ్వాలని కోరారు.
ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొవిడ్-19 నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కార్మికులకు 25వేలు అదనంగా పారితోషికం ఇవ్వాలని కోరారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి మూడు నిలలు పాటు నిత్యావసర వస్తువులు అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: వలస కష్టాలు.. తోపుడు బండిపై గర్భిణి