వెంచర్ కోసం డబ్బులిచ్చారు... మోసపోయామని ట్యాంక్ ఎక్కారు.. - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు
20:52 February 15
న్యాయం చేయాలంటూ నీళ్ల ట్యాంక్ ఎక్కిన మహిళలు
కరీంనగర్‌లోని అంబేడ్కర్‌నగర్‌లో వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళలు నిరసన తెలిపారు. ఓ మహిళ తమను మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ ప్రారంభిస్తానని చెప్పటంతో ఆ మహిళకు బంగారం తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చామన్నారు.
మోసం గ్రహించి డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగితే ఇచ్చేది లేదని.. కేసు పెడతానని సదరు మహిళ బెదిరిస్తోందని తెలిపారు. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలకుపైగా నగదు వసూలు చేసినట్లు ఆరోపించారు. మొత్తం రూ.3 కోట్ల మేర వసూలు చేసిన మహిళ మోసం చేసిందని వారు చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు.