పట్టపగలే మహిళను బండరాయితో దారుణంగా కొట్టి చంపిన ఘటన... కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్‌లో చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన పలువులు వ్యక్తులు... పాత కక్షలతో బండ సమ్మక్కపై గురువారం ఉదయం వెంటాడి దాడికి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
పట్టపగలే మహిళ దారుణ హత్య - women murder in rangapuram
కరీంనగర్ జిల్లా రంగాపూర్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను వెంటాడి.. బండరాయితో మోదీ హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
పట్టపగలే మహిళ దారుణ హత్య
ఇరు కుటుంబాల మధ్యనున్న వివాదాలే కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. గ్రామస్థుల సమాచారంతో హుజూరాబాద్ సీఐ మాధవి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: పాతబస్తీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య