ఎంతమందికి శిక్షణనిచ్చారు?
ఇదే రాష్ట్రంలో మొదటి మహిళా పోలీస్ కమాండోల బృందం. కేవలం పురుషులకు మాత్రమే ఇచ్చే కఠినమైన ఇజ్రాయిల్ యుద్ధ శిక్షణ క్రావ్‌మగాను... మహిళలకు నేర్పడం దేశంలో ఇదే ప్రధమం. తొలుత 80 మంది సిబ్బందికి శారీరకంగా దృఢంగా ఉండేందుకు 15 రోజుల పాటు అవసరమైన శిక్షణ అందించారు. ఇందులో పాస్ అయిన 43 మంది చురుకైన వారిని ఎంపిక చేసి నెల రోజుల పాటు క్రావ్మగా నేర్పించారు. ఆయుధం లేకుండా ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడం, అనుమానాస్పద వ్యక్తులను అరెస్టు చేయడంలో తర్ఫీదు పొందారు. శిక్షణ అనంతరం... ఈ విద్యలో పురుషులు మాత్రమే కాదు తాము రాటుదేలామని చెబుతున్నారు ఈ మహిళా కమెండోలు.
ధ్రువీకరణ పత్రాలు అందజేత
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న సిబ్బందిని సీపీ కమలాసన్ రెడ్డి అభినందించారు. ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. శిక్షణ వల్ల మహిళా సిబ్బందిలో ఆత్మస్థైర్యం మరింత పెరిగిందని సీపీ తెలిపారు.