తెలంగాణ

telangana

ETV Bharat / state

'గోరింటాకుతో ఆనందమే కాదు... ఆరోగ్యం కూడా' - గోరింటాకు

తొలకరి జల్లులతో ప్రకృతి శోభనందించే వేళ వచ్చేదే ఆషాఢమాసం. ఈ నెలలో గోరింటాకు పెట్టుకుంటే ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా అంటున్నారు మహిళలు.

Women celebrate the mehandi festival

By

Published : Jul 10, 2019, 2:39 PM IST

'గోరింటాకుతో ఆనందమే కాదు... ఆరోగ్యం కూడా'

ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రాధాన్యతను వివరించేందుకు కరీంనగర్​లో కిట్టి పార్టీ ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు జరుపుకున్నారు. మహిళలంతా కలిసి సంప్రదాయబద్ధంగా గోరింటాకు తెచ్చి నూరి చేతులకు పెట్టుకున్నారు.

ఎంతో ప్రయోజనం

ఆధునిక యుగంలో గోరింటాకు అంటే దుకాణాల్లో రెడీమేడ్‌గా లభ్యమయ్యే కోన్‌ అనే అభిప్రాయంతో ఉన్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆషాఢమాసంలో గోరింటాకు వల్ల కలికే ప్రయోజనాలను తెలిపేందుకు ఈ సంబురాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. అపార్ట్‌మెంట్ల యుగంలో ఇళ్లల్లో మొక్కలు కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. గోరింటాకు ప్రయోజనాలను నేటి తరానికి పరిచయం చేస్తున్నామని కిట్టీపార్టీ మహిళలు పేర్కొన్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు.

ఇదీ చూడండి: హస్తినలో తెరాస పార్లమెంటరీ భేటీ, హాజరైన డీఎస్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details