Woman Teaching Telugu in America :కరీంనగర్‌కు చెందిన మాధవీలత ఆచిరామాచార్యులు.. గత పన్నెండేళ్లుగాఅమెరికాలో స్థిరపడ్డారు. బాల్యం నుంచి సంగీతం అంటే ఇష్టం.. చిరుప్రాయంలో కరీంనగర్‌లో ఎన్నో ప్రదర్శనలు చేశారు. హైదరాబాద్‌లోను ఎన్నో సంగీత కచేరీల్లో పాల్గొనడమే కాకుండా.. సినిమా పాటల్లోను కోరస్‌గా పాటలు పాడారు. వివాహం అనంతరం అమెరికాకు వెళ్లిన క్రమంలో.. చిన్నారులకు ఉచితంగా సంగీతంలో శిక్షణ ఇవ్వాలని భావించారు.
Karimnagar Woman Teaching Telugu in America : అయితే ఆంగ్లం మాట్లాడటం ఇబ్బంది కావడంతో.. వారికి తెలుగుతో పాటు సంగీతం నేర్పించాలన్న నిర్ణయానికి వచ్చారు. తొలుత 70మందితో ప్రారంభమైన ఉచిత శిక్షణ ఇప్పుడు 150మందికి చేరిందని మాధవీలత సంతోషాన్ని వ్యక్తం చేశారు.2013 నుంచి 2017వరకు దాదాపు 700మంది చిన్నారులకు తెలుగుభాషతో పాటు సంగీతాన్ని నేర్పించడం ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నారు మాధవీలత.
Karimnagar NRI Teaching Telugu in US :తాను చికాగో, డల్లాస్, అరోరోలో చాలా ప్రోగ్రాములు ఇవ్వగా మంచి పేరు సంపాదించానని.. తెలుగుభాష నేర్పే భాగ్యం తనకు కలిగిందని మాధవీలత తెలిపారు. కరీంనగర్‌లోని కట్టా సత్యనారాయణ భాగవతార్ వద్ద శాస్త్రీయ సంగీతం, హైదరాబాద్ గురువు రామాచారి వద్ద లలిత సంగీతం నేర్చుకున్నట్లు చెప్పారు. తెలుగు, సంస్కృతం, సినీగీతాల్లో వర్ణాల వరకు నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ ఔదార్యం..నిరుపేదలకు చిరుసాయం
తాను అమెరికాలో ఉన్నప్పుడు కరీంనగర్ వాసులకు స్కైప్ లేదా వాట్సప్ ద్వారా సంగీతంలో శిక్షణ ఇస్తున్నానని.. మృదంగం, వాయిలిన్, వీణ, తబల, పియానోపై సంగీతం నేర్పించానని చెప్పారు. ప్రతి పిల్లవాడికి అమ్మఒడే బడి కావాలన్న ఉద్దేశ్యంతో.. చిన్నారులతో పాటు వారి తల్లికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకు.. అత్తారింటికి దారేది, ఈగ, బాహుబలి, షిర్డిసాయిబాబా మహత్యం సినిమాల్లోను కోరస్‌గా పాడినట్లు చెప్పారు.
తనకు పాటలు పాడాలంటే చాలా ఇష్టమని.. ఇప్పటి వరకు 700కు పైగా పాటలు పాడినట్లు పేర్కొన్నారు. సెలవుల్లో తాము కరీంనగర్‌కు వచ్చినప్పటికి సంగీతం నేర్చుకోవడం కొనసాగిస్తామని మాధవీలత పిల్లలు చెప్పారు.ఏడాదికి ఒకసారి కరీంనగర్‌కు వచ్చే మాధవీలత కోసం ఎదురుచూస్తుంటామని చెబుతున్నారు. పిల్లలు సైతం సంగీతం నేర్చుకోవడమే కాకుండా పాటలు పాడటంలోను ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా సంగీతం, తెలుగు నేర్చుకుంటామంటే ఉచితంగా నేర్పడానికి సిద్దమని మాధవీలత చెబుతోంది.
"నాకు బాల్యం నుంచి సంగీతం అంటే ప్రాణం. హైదరాబాద్‌లో ప్రదర్శనలు కూడా ఇచ్చాను. ప్రముఖ తెలుగు చిత్రాలలో కోరస్‌గా పాడాను. అమెరికాకు వెళ్లాక అక్కడి పిల్లలకు సంగీతం, తెలుగు నేర్చుకోవడానికి శిక్షణ ఇస్తున్నాను. మా స్వగృహం కరీంనగర్‌కు వచ్చినప్పుడు.. ఇక్కడి పిల్లలకు కూడా శిక్షణ ఇస్తున్నాను". - మాధవీలత, సంగీత శిక్షకురాలు.
మెట్ల నుంచి 'పియానో' రాగాలు.. ఫిదా అవుతున్న ప్రయాణికులు
NRI Donation for Yadadri Temple : యాదాద్రి గోపురం బంగారు తాపడానికి ఎన్ఆర్ఐ భారీ విరాళం