కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చంజర్లకు చెందిన యువతి ఖాదర్ గూడెంకు చెందిన సురేష్ గత రెండెళ్లుగా ప్రేమించుకున్నారు. గత ఆరు నెలల క్రితమే వివాహం కూడా చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా... ఆమె గర్భం కూడా దాల్చింది. ఇన్నాళ్లూ హాయిగా సాగిన వీరి జీవితంలో కలహాలు మొదలయ్యాయి.
భర్త కోసం నీళ్ల ట్యాంక్ ఎక్కి గర్భిణీ నిరసన - ప్రియుడి కోసం నీళ్ల ట్యాంక్ ఎక్కి యువతి నిరసన
నువ్వే నా ప్రాణమంటూ వెంట పడ్డాడు. నమ్మిన యువతి అతనితో ప్రేమకు సై అంది. కొంత కాలం తర్వాత వివాహం కూడా చేసుకున్నారు. ఆమె గర్భం దాల్చగానే అతడు మెహం చాటేశాడు. ఏం చేయాలో పాలుపోని యువతి నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తోంది. ఎలాగైనా సరే తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటోంది.
భార్యను వదలిపెట్టి యువకుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. ఏం చేయాలో పాలుపోని యువతి ఖాదర్గూడెంలోని నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకున్న వాడే వదిలేస్తే... తన గతేంటని వాపోతోంది. స్థానికులు ఎంతగా బతిమాలినా కిందకు దిగలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాగైనా సరే నీకు న్యాయం చేస్తామని సీఐ సంతోష్ కుమార్ హామీ ఇవ్వడంతో యువతి కిందకు దిగింది.
ఇవీ చూడండి:ఆదివారం కరోనా పరీక్షలకు ఆటంకం.. మూడొంతుల కేంద్రాల మూత