తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 5:55 PM IST

ETV Bharat / state

రక్తపోటు మరణాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్​వో ప్రతినిధి

కరీంనగర్​ జిల్లాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం పర్యటించింది. ఎయిడ్స్​, క్షయ, మలేరియా మరణాల కన్నా అధిక రక్తపోటుతో ఎక్కువ మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్​వో ప్రతినిధి టామ్​ ఫ్రీడెన్​ తెలిపారు.

రక్తపోటు మరణాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్​వో ప్రతినిధి


కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సభ్యులు సందర్శించారు. ప్రభుత్వ వైద్య సేవలో ఉచితంగా అందిస్తున్న మందులను స్వయంగా పరిశీలించారు. అధికరక్తపోటు నేటి పరిస్థితుల్లో ప్రాణాలను నిశబ్ధంగా హరిస్తోందని డబ్ల్యూహెచ్​వో ప్రతినిధి డాక్టర్ టామ్ ఫ్రీడెన్ అన్నారు. భారతదేశంలో ఎయిడ్స్, క్షయ, మలేరియా కన్నా రక్తపోటు మరణాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. సకాలంలో వైద్య సేవలు అందించడానికి ముందుగా వైద్య నిర్ధరణ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు.

రక్తపోటు మరణాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్​వో ప్రతినిధి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అధిక రక్తపోటు తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేశారని టామ్​ ఫ్రీడెన్​ తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవల్లో శాస్త్రీయ పద్ధతిని పాటిస్తూ సరైన మందులను సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలో అధిక రక్తపోటు నివారణకు అందిస్తున్న వైద్య సేవలు యావత్ భారతదేశం మాత్రమే కాక బంగ్లాదేశ్, ఆఫ్రికా, చైనా వంటి దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని టామ్​ ప్రసంశించారు.

ఇదీ చూడండి : అమెరికా సైన్యం చేతిలో బగ్దాదీ వారసుడు హతం

ABOUT THE AUTHOR

...view details