రాష్ట్రంలోని ప్రజా సంఘాలన్నింటిని ఏకం చేసి భాజపా అంతు చూస్తామని రాష్ట్ర ప్రజా సంఘాల ఐకాస వ్వవస్థాపక అధ్యక్షులు గజ్జెల కాంతం పేర్కొన్నారు. కరీంనగర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
భాజపా ప్రభుత్వం.. రాముడి పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేస్తోందని కాంతం ఆరోపించారు. మావోయిస్టు, కమ్యూనిస్టు పార్టీల కంటే భాజపా భయంకరమైనదని విమర్శించారు.