తెలంగాణ

telangana

ETV Bharat / state

వినోద్​ను లక్ష ఓట్ల ఆధిక్యతతో దిల్లీకి పంపాలి - B VINOD KUMAR

లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెరాస నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి  బి.వినోద్​కుమార్ హాజరయ్యారు.

లక్ష ఓట్ల ఆధిక్యతతో వినోద్​ను దిల్లీకి పంపాలి

By

Published : Mar 20, 2019, 11:14 PM IST

కేంద్ర ప్రభుత్వంలో తెరాస కీలకం కాబోతోంది : మంత్రి ఈటల

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శుభం గార్డెన్స్​లో తెరాస నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మంత్రి ఈటల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈటల జన్మదినం సందర్భంగా తెరాస కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.

ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో తెరాస కీలకం కాబోతోందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలం వరకు మిడ్ మానేరు, గౌరవెల్లి ప్రాజెక్టులకు గోదావరి జలాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు.

నన్ను గెలిపించండి
ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడి కాంగ్రెస్ 10 ఏళ్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచిందని తెరాస కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ విమర్శించారు. తన గెలుపునకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు.

ఇవీ చూడండి :ప్రగతి భవన్‌లో ముఖ్య నేతలతో కేసీఆర్​ భేటీ


ABOUT THE AUTHOR

...view details