'వాజ్పేయీ సేవలు మరవలేనివి' - nivali
భారత దేశ మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్పేయీ వర్ధంతిని భాజపా నేతలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
'వాజ్పేయీ సేవలు మరవలేనివి'
దేశ మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్పేయీ ఎంతోమంది కార్యకర్తలకు మార్గదర్శి అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. జిల్లాలోని భాజపా పార్టీ కార్యాలయంలో వాజ్పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భౌతికంగా అటల్ దూరమైన ఆయన జ్ఞాపకాలు, దేశానికి చేసిన సేవలు గణనీయమని తెలిపారు. ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకుని పార్టీని బలోపేతం చేయడానికి పాటుపడాలని బండి సంజయ్ కుమార్ సూచించారు.