తెలంగాణ

telangana

ETV Bharat / state

ఛైర్మన్​ పదవి కోసం ఇద్దరు తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ - PACS ELECTION 2020

సొసైటీ ఛైర్మన్​ పదవి కోసం ఇద్దరు అధికార పార్టీ మద్దతుదారుల వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కరీంనగర్​ జిల్లా మెట్​పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరు వర్గాలు గొడవకు దిగటం వల్ల పోలీసులు రంగప్రవేశం చేశారు. తీవ్రంగా శ్రమించి పరిస్థితిని చక్కబెట్టారు.

TWO COMMUNITIES FOUGHT FOR CHAIRMEN SEAT AT SHANKARAPATNAM
TWO COMMUNITIES FOUGHT FOR CHAIRMEN SEAT AT SHANKARAPATNAM

By

Published : Feb 15, 2020, 11:42 PM IST

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి సహకార సంఘం ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఛైర్మన్‌ పదవి కోసం తెరాసపార్టీలోని ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. మెట్‌పల్లిలో మొత్తం 13 వార్డులుండగా... ఇద్దరు తెరాస మద్దతుదారులు డైరెక్టర్లుగా గెలిచారు. ఇద్దరు అభ్యర్థులు ఛైర్మన్‌ పదవులను ఆశిస్తుండటం వల్ల 4వ వార్డులో గెలిచిన అభ్యర్థిని శిబిరానికి తరలించే క్రమంలో గొడవ చెలరేగింది.

ఇద్దరు అభ్యర్థులకు చెందిన వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. కాసేపు శ్రమించి ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న హుజూరాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌రావు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఛైర్మన్​ పదవి కోసం ఇద్దరు తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ

ఇవీ చూడండి:శంషాబాద్​లో 1100 గ్రాముల బంగారం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details