ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా డిపో మేనేజర్లు మినహా కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీకి చెందిన 642 బస్సులతో పాటు 208 ప్రైవేటు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం సమ్మె కారణంగా కేవలం ప్రధాన రూట్లలో మాత్రమే బస్సు సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలన్న ధ్యేయంగా ప్రైవేట్ వాహనాలకు అనుమతులు మంజూరు చేశారు. ఇదే అదునుగా యజమానులు మాత్రం ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు.
ఆర్టీసీ సమ్మె: నిరుద్యోగుల పాలిట వరం - tsrtc bus strike today
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోవటం వల్ల అధికారులు తాత్కాలికంగా ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుంటున్నారు. ప్రధాన రూట్లలో మాత్రమే బస్సు సర్వీసులు నడటపటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆర్టీసీ సమ్మె: నిరుద్యోగుల పాలిట వరం