టీఎస్ ఎన్పీడీసీఎల్ కార్మికుల నిరసన - karimnagar
తమకు అన్యాయం జరిగిందని జూనియర్ లైన్మెన్లు కరీంనగర్‌లోని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
కార్మికుల నిరసన
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విడిపోయిన తర్వాత ఎన్పీడీసీఎల్లో పనిచేసిన కార్మికులకు ప్రమోషన్లు వచ్చాయని... టీఎస్ ఎన్పీడీసీఎల్లో పనిచేసిన వారికి మాత్రం ప్రమోషన్లు లేక జూనియర్ లైన్మెన్ గానే పదవీ విరమణ చేస్తున్నామని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరారు. విద్యుత్‌శాఖ ఇంజనీర్ మాధవరాంను కలిసి వినతి పత్రం అందించారు. సమస్యను పరిష్కరించని ఎడల ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.