మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండలంలోని 8 గ్రామాల కేడర్ ఈటలకు మద్దతు తెలిపింది. వీణవంక మండల తెరాస పార్టీ అధ్యక్షుడు మారుమల్ల కొమురయ్య, వైస్ ఎంపీపీ రాయశెట్టి లతా, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోర స్వామిలతో పాటు 8 గ్రామాల అధ్యక్షులు, నాయకులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈటలకు మద్దతుగా తెరాసకు రాజీనామా చేసిన 8 గ్రామాల కార్యకర్తలు - తెలంగాణ వార్తలు
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని 8 గ్రామాల తెరాస కార్యకర్తలు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతు తెలిపారు. తెరాస ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు.
ఈటల రాజేందర్, తెరాస కార్యకర్తలు
ఈటల తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని ప్రకటించారు. వీణవంక ఎంపీపీతో పాటు పలువురు ప్రజా ప్రతినిధిలు ఈటల ఫోటో పెట్టుకుని గెలిచారని, ఇప్పుడు ఆయననే విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని, తాము ఈటల ఫోటోతో బరిలో నిలుస్తామని అన్నారు.
ఇదీ చదవండి:PRC: ఉద్యోగులకు గుడ్‌న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!