హుజూరాబాద్ ఉపఎన్నికలో భాజపా, ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అక్రమాలకు పాల్పడుతున్నారని తెరాస నేతలు(TRS leaders Complaint on BJP) ఆరోపించారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు భాజపా యత్నిస్తోందన్నారు. బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరుస్తున్నారని... ఈ మేరకు తెరాస ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. చాలామంది పేర్లతో బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి.. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
TRS leaders Complaint on BJP: హుజూరాబాద్‌లో భాజపా తీరుపై సీఈవోకు తెరాస ఫిర్యాదు - తెలంగాణ వార్తలు
తెరాస నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల వేళ... నియోజకవర్గంలో భాజపా అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా భాజపా నేతలు కేంద్ర మంత్రిని తీసుకొచ్చి... పక్క నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేశారన్న తెరాస నేతలు... ఇప్పుడు మాత్రం కేసీఆర్ సభ పెడతామంటే ఈసీ ఆంక్షలు పెడుతోందని ఆరోపించారు(TRS leaders Complaint on BJP). కేంద్ర ఎన్నికల కమిషన్‌ను భాజపా ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాత వైఖరితో ఉండాలని... తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దళితబంధు కూడా ఆపారని... ఇది సబబు కాదని అన్నారు.
ఇదీ చదవండి:TS High Court news: దళితబంధు నిలిపివేతపై మరో రెండు వ్యాజ్యాలు