ఎన్నికలు దగ్గర పడే కొద్ది అభ్యర్థులను అనేక రకాల భయాలు వెంటాడుతాయి. తన గుర్తు (party symbol) ప్రజల్లోకి వెళ్లిందా లేదా.. తన గుర్తు అనుకొని ఓటర్లు మరో గుర్తుకు ఓటేస్తారా..? అందరిని కలిసానా లేదా..? ఇలా ఎన్నెన్నో అనుమానాలు అభ్యర్థులను వెంటాడుతుంటాయి. గతంలో ఎన్నో సందర్భాల్లో గుర్తిన పోలిన గుర్తులు ఉండండం వల్ల ఫలితాలు తారుమారైన సంగతులు ఎన్నో చూశాం. అయితే ఈసారి హుజురాబాద్ ఉప ఎన్నికలో (huzurabad by election) విజయం తమదేనని ధీమాగా ఉన్న తెరాసను... ఇప్పుడు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు హడలెత్తిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన రోడ్డు రోలర్, చపాతి రోలర్ గుర్తులు (chapati roller and road roller symbols) ... తెరాసను కలవరపెడుతున్నాయి.
వాటిని చూడగానే మొదలైన కలవరం
హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మిగిలిన 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల గుర్తులున్నాయి. వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. స్వతంత్ర అభ్యర్థుల్లో (independent candidates) ఒకరికి రోడ్డు రోలర్, మరో అభ్యర్థికి చపాతి రోలర్ గుర్తులను (chapati roller and road roller symbols) ఇచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన ఆ రెండు గుర్తులను చూడగానే తెరాస శ్రేణుల్లో కలవరం మొదలైంది.
గతంలో ఈ గుర్తులతోనే ముప్పు..!