హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్లకు చివరి రోజు కావటంతో ఆర్డీవో కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు దాఖలు చేసేందుకు రావటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల వరకు ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది. నిన్నటి వరకు హుజూరాబాద్ ఉపఎన్నికకు 24 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
Huzurabad By Election 2021: హుజూరాబాద్‌లో తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ - తెలంగాణ వార్తలు
13:18 October 08
హుజూరాబాద్ ఉపఎన్నికకు నామినేషన్లు వేసిన తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు
ఈ నెల 11న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election Polling 2021) పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తెలిపింది.
ఈటల రాజీనామాతో ఎన్నిక అనివార్యం
రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గం(Huzurabad By Election 2021)లో ఉపఎన్నిక వచ్చింది. ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది. ఇటు అధికార తెరాస, అటు భాజపా ప్రచారాల(Huzurabad By Election Campaign 2021)తో హోరెత్తుతోంది. ఇప్పటికే తెరాస మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలోనే ఉండి.. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటున్నారు. రోజుకో వర్గానికి సంబంధించి ఆత్మీయ, సమ్మేళన సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో తెరాసపై పాజిటివ్ టాక్ తీసుకొస్తున్నారు.
ఇవీ చదవండి: