కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు ఏడాది పసిపాపపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కూలీ పనిచేస్తున్న ప్రదేశంలో పాపను పడుకోబెట్టారు. ఇది గమనించని డ్రైవర్ ట్రాక్టర్‌ను వెనక్కి తీయగా.. పసిపాపపై నుంచి దూసుకెళ్లింది. నిరుపేదలైన వలస కూలీల కుటుంబాల్లో ఈ ఘటన పెనువిషాదం నింపింది. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పసిపాపపై నుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్
ఏడాది పసిపాపపై నుంచి ట్రాక్టర్ దూసుకెళ్లింది. చిన్నారి అక్కడిక్కడే మృతిచెందింది.ఈ ఘటన కరీంనగర్ జిల్లా గుండి గ్రామంలో చోటుచేసుకుంది.
పాపపై నుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్