రేకుర్తిలోని దిల్లీ డిఫెన్స్ అకాడమీ ఇంటర్మీడియట్ కళాశాల అనుమతి లేకున్నా తమ కళాశాల రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయి అత్యధిక మార్కులు సాధించారని అసత్య ప్రకటనలు చేస్తూ... విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థి సంఘాలు ఫిర్యాదు ఇచ్చినప్పటికి ఫిర్యాదుపై ఇంటర్మీడియట్ విద్యాధికారులు కేవలం నోటీసులు మాత్రమే జారీ చేసి చేతులు దులుపుకోనే ప్రయత్నం చేశారన్నారు. ప్రతి సంవత్సరము విద్యా సంవత్సరం అరంభంలో అసత్య ప్రకటనలు, అనుమతులు లేని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంటర్మీడియట్ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.
'దిల్లీ డిఫెన్స్ అకాడమీ అసత్య ప్రచారాలు చేస్తోంది' - arimnagar district news
కరీంనగర్ పట్టణం రేకుర్తిలోని దిల్లీ డిఫెన్స్ అకాడమీకి అనుమతి లేకున్నా రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించామని అసత్య ప్రచారం చేస్తోందని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు.
ఇంటర్మీడియట్ బోర్డు నిబందనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నకళాశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని కోరారు. అసత్య ప్రచారాలు చేస్తున్న దిల్లీ డిఫెన్స్ అకాడమీపై క్రిమినల్ కేసులు పెట్టే విధంగా పోలీసు శాఖ వారిని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి రవీందర్ హెచ్చరించారు
ఇవీ చూడండి: 'కరోనాతో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి'