రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని మహమూద్‌నగర్‌కు చెందిన సయ్యద్ యూసుఫ్(67), రంగారెడ్డి జిల్లా సైబరాబాద్‌లోని ఇందిరానగర్‌కు చెందిన మహమ్మద్ బషీర్‌ఖాన్ అలియాస్ బషీర్(43) వరుసకు బావ, బావమరుదులు. దొంగతనాలను వృత్తిగా ఎంచుకుని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులు, అమాయకులను కారు, ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్తారు. మారణాయుధాలతో బెదిరించి డబ్బులు, నగలు దోపిడీ చేసి పారిపోతారు.
సయ్యద్ యూసుఫ్ సుమారు 30 కేసుల్లో ప్రధాన నిందితుడు కాగా కరీంనగర్ ఒకటో ఠాణాలో కేడీషీటు ఉంది. మహమ్మద్ బషీర్‌ఖాన్ 25 కేసుల్లో నిందితుడు. 2019 డిసెంబర్ 25న కరీంనగర్‌లోని కశ్మీర్‌గడ్డలో ఆడెపు సందీప్ ఇంటిముందున్న ఆటో(టీఎస్ 02 యూసీ 0561) చోరీ జరిగింది. సందీప్ ఫిర్యాదు మేరకు రెండో ఠాణాలో కేసు నమోదైంది. సీసీ కెమేరాలను పరిశీలించిన సీసీఎస్ పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు.