కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయాశాఖాధికారి ప్రియదర్శిని తెలిపారు. జిల్లాకు 52వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటికే 24వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు తెలిపారు. రైతులు యూరియా కోసం బారులు తీరి నిలబడాల్సిన అవసరం లేదని కొన్ని రైళ్ల రవాణాలో ఆలస్యం వల్ల కొంత తాత్సారం జరిగిందని చెప్పారు. యూరియా తీసుకొస్తున్న రైళ్లు ఆలస్యం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా ఆయా ర్యాకులు గమ్యాన్ని చేరుకొనే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆమె వివరించారు.
'యూరియా కోసం ఆందోళన అవసరం లేదు' - కరీంనగర్
కరీంనగర్ జిల్లాకు 52వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటికే 24వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వ్యవసాయాధికారి ప్రియదర్శిని తెలిపారు.
ఆందోళన అవసరం లేదు