కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బంధువు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ఆక్సిజన్ అందించకపోవడం వల్లే మరణించాడని బోరున విలపించారు. జగిత్యాల జిల్లా వెంకట్ రావు పేటకు చెందిన వ్యక్తి మృతి చెందగా... మృతదేహాన్ని ఆరు గంటల పాటు అలాగే ఉంచారని వాపోయారు.
'అంబులెన్సులు లేవంటూ వార్డులోనే ఆరు గంటల పాటు మృతదేహం'
కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగానే తమ బంధువు మృతి చెందాడని మృతుని బంధువులు ఆరోపించారు. ఆక్సిజన్ అందించలేదని బోరున విలపించారు. అంబులెన్సులు లేవని మృతదేహాన్ని గంటల తరబడి వార్డులోనే ఉంచారని వాపోయారు.
కరీంనగర్ ఆస్పత్రిపై ఆరోపణలు, వైద్య సిబ్బందిపై ఆరోపణలు
అంబులెన్స్‌లు లేవని... వచ్చేవరకు వేచి చూడాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆరోపించారు. మృతదేహాన్ని గంటల తరబడి వార్డులో ఉంచడం వల్ల చికిత్స పొందుతున్న ఇతర రోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'సెకండ్ వేవ్' విలయం: నిమిషానికి 243 కేసులు