కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లో చేతికందిన వరి పంట నేలవాలింది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్నలు తడిచిపోయాయి. తెరాస నాయకులు మార్కెట్‌కు చేరుకొని రైతులతో మాట్లాడారు. హుజూరాబాద్ మండలం చెల్పూరులో బూతుకూరి ఓదేలుకు చెందిన ఇల్లు వర్షం నీటికి తడిసి ముద్దయి కూలిపోయింది.
అకాల వర్షానికి తడిసిన ధాన్యం..రైతుల కన్నీళ్ల పర్యంతం.. - రైతుల కన్నీళ్ల పర్యంతం..
కరీంనగర్ జిల్లాలో అకాల వర్షానికి పలు మండలాల్లో పంటలు నీటి పాలయ్యాయి. రైతులు చేతికందిన పంటలు తడిచిపోవడంపై ఆందోళన చెందుతున్నారు.
అకాల వర్షానికి తడిచిన ధాన్యం..రైతుల కన్నీళ్ల పర్యంతం..