తెలంగాణ

telangana

ETV Bharat / state

Etela: 'ఈటల.. సీఎం పదవి కోసం ఆశపడుతున్నారు' - ఆర్యవైశ్యుల సంఘం

పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్ కోలేటి దామోదర్.. కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌లో పర్యటించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్‌కు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.

etela dispute
etela dispute

By

Published : Jun 15, 2021, 6:56 PM IST

మాజీ మంత్రి ఈటల.. సీఎం పదవి కోసం ఆశపడుతున్నారని పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. తెరాసలో ఈటలకు సముచిత స్థానాన్ని కల్పించిన గొప్ప వ్యక్తి కేసీఆర్‌ అంటూ కొనియాడారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల సంఘం సమావేశంలో.. కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

తెరాసతోనే ఆర్యవైశ్యులకు మంచి గుర్తింపు లభించిందన్నారు. హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్‌కు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. తెరాసను ఆశీర్వదించే సమయం వచ్చిందంటూ.. పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌ ఛైర్‌పర్సన్‌ నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Etela: తెరాస పునాదులు ఎవరూ పెకిలించలేరు : వినయ భాస్కర్

ABOUT THE AUTHOR

...view details