కరీంనగర్లో ఏర్పాటైన ఐటీ టవర్‌తో జిల్లాలోని యువతతో పాటు ఉత్తర తెలంగాణలోని విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు.
'ఆనాటి ఆలోచనే నేటి ఐటీ టవర్గా మారింది'
తెలంగాణ ఏర్పడ్డాక తాను ఎంపీగా, గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కరీంనగర్లో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆలోచించామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద కుమార్ అన్నారు. ఈనెల 18న కరీంనగర్లో ఐటీ టవర్ ప్రారంభం కానుందని తెలిపారు.
'ఆనాటి ఆలోచనే నేటి ఐటీ టవర్గా మారింది'
తాను ఎంపీగా, గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరంలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనే ఈరోజు ఐటీ టవర్గా మార్పు చెందిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ కంపెనీలు నగరానికి వచ్చేందుకు దోహదపడిందన్నారు.
టెక్ మహేంద్రా వంటి కంపెనీలు నగరంలో తమకు భూమి కేటాయిస్తే వారి కంపెనీలు స్వయంగా వారే నిర్మించుకుంటామంటున్నాయని వినోద్ పేర్కొన్నారు. ఈ నెల 18న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నగరంలోనీ ఐటీ టవర్ ప్రారంభమవుతుందని తెలిపారు.