రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పుట్టిన రోజు వేడుకలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ, తెరాస రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్పర్సన్ గందె రాధిక, వైస్ ఛైర్పర్సన్ కొలిపాక నిర్మల ఈటలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా మంత్రి ఈటల జన్మదిన వేడుకలు - minister etela rajender birthday celebrations in Huzurabad
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఘనంగా జరిగాయి. మంత్రి పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మంత్రి ఈటల జన్మదిన వేడుకలు
హుజూరాబాద్ పట్టణంలో పర్యటించిన ఈటల.. అంబేడ్కర్ కూడలి వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పురపాలక అధికారులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వచనం తీసుకున్న అనంతరం.. ఈటల కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
- ఇదీ చదవండి :మురికివాడలోనే ఆ నగర మేయర్ నివాసం