తెలంగాణ

telangana

ETV Bharat / state

రేషన్​బియ్యాన్ని విక్రయిసున్న దందా గుట్టురట్టు - అక్రమ రవాణా

రేషన్‌ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న దందాపై పోలీసులు దృష్టి పెట్టారు. అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ట్రాలీఆటోను పట్టుకున్నారు. విచారించగా కరీంనగర్​ హుజూరాబాద్​లోని ఓ మిల్లులో పెద్దమొత్తంలో ఉన్న పీడీఎస్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

task force Police have been keeping a close watch on Danda selling illegal ration rice. 250 quintals of rice were seized in karimnagar
రేషన్​బియ్యాన్ని విక్రయిసున్న దందా గుట్టురట్టు

By

Published : Mar 8, 2020, 4:53 PM IST

రేషన్​ బియ్యాన్ని మూడో కంటికి తెలియకుండా రీసైక్లింగ్​ చేసి విక్రయిస్తున్న దందాపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని మహేశ్వరీ ట్రేడర్స్‌లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నిలువ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. విడిబియ్యంతో పాటు బస్తాలలో నిలువ ఉంచిన బియ్యాన్ని తనిఖీ చేశారు.

రీసైక్లింగ్‌ చేసేందుకు మిల్లు యంత్రంలో ఉన్న బియ్యాన్ని గుర్తించారు. సుమారు 250 నుంచి 300 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం ఉన్నట్లు సీఐ వెల్లడించారు. సమాచారాన్ని సివిల్‌ సప్లై అధికారులకు అందించారు. మిల్లుకు చెందిన నార్ల భాస్కర్‌ అనే వ్యక్తి పట్టణంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఈ దందాను కొనసాగిస్తున్నట్లు వివరించారు.

అతను సేకరించిన బియ్యాన్ని ట్రాలీఆటోలో మిల్లుకు తరలించి 50 కేజీల బస్తాలుగా తయారు చేసి తిరిగి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. మిల్లులో ఎఫ్‌సీఐకి సబంధించిన బస్తాలను గుర్తించారు. వీటిపై పూర్తిగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

మిల్లును హుజూరాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌రావు పరిశీలించారు. మిల్లు నిర్వాహకులతో మాట్లాడి పలు వివరాలు సేకరించారు. ఇటువంటి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

రేషన్​బియ్యాన్ని విక్రయిసున్న దందా గుట్టురట్టు

చూడండి:అసెంబ్లీలో నమస్కారం 'కరో'నా అంటున్న నేతలు

ABOUT THE AUTHOR

...view details