లక్ష తమలపాకులతో అంజన్నకు అర్చన - తమలపాకుల అర్చన
హనుమంతునికి ప్రీతికరమైన మంగళవారం రోజున లక్ష తమలపాకులతో అర్చన చేశారు కరీంనగర్ జిల్లా వాసులు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తమలపాకుల అర్చన
కరీంనగర్ జిల్లా మంకమ్మ తోటలోని హనుమాన్ దేవాలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లక్ష తమలపాకులతో అర్చన చేశారు. స్వామివారికి తమలపాకులను సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీరామ నామంతో హనుమాన్ దేవాలయం మారుమ్రోగింది. సకాలంలో వర్షాలు కురిసి.. పాడి పంటలు పంటలు పండాలని అర్చన చేసినట్లు శ్రీ హనుమాన్ దేవాలయ పురోహితులు తెలిపారు.