'ఇలాంటివి పునరావృతమైతే సహించేది లేదు' - students rally in karimngar
శంషాబాద్ ఘటనలోని నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ... కరీంనగర్‌లో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.
'ఇలాంటివి పునరావృతమైతే సహించేది లేదు'
శంషాబాద్‌లో పశు వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితులను ఉరి తీయాలని... కరీంనగర్‌లో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రదర్శనలో నిందితుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. యువతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురాకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు.