తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఫలితాలే రిపీట్​: పొన్నం ప్రభాకర్ - పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్

కేంద్ర ప్రభుత్వాన్ని మార్చాలన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు కరీంనగర్ కాంగ్రెస్​ లోక్​సభ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రశ్నించే గొంతులుండాలని కోరుకుంటున్నారని పొన్నం వ్యాఖ్యానించారు. అందుకు ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనమన్నారు.

సారు..కేసీఆర్..దిల్లీలో బేకార్​: పొన్నం ప్రభాకర్

By

Published : Mar 28, 2019, 4:57 PM IST

రాష్ట్రం, కేంద్రంలో ఒకే పార్టీ ఉంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని గత అయిదేళ్లు ప్రజలు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. స్థానికేతరుడైన ఎంపీ వినోద్​ కరీంనగర్​కు చేసిందేమీలేదన్నారు. ఎవరెన్ని చెప్పినా ఎమ్మెల్సీ ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి తనకు అవకాశమిస్తే విద్య, వైద్యం, వ్యవసాయం,ఉపాధి, పర్యాటకం లాంటి రంగాల్లో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానాని పొన్నం ప్రభాకర్ పంచరత్నాల్లాంటి హామీలు ఇచ్చారు.

సారు..కేసీఆర్..దిల్లీలో బేకార్​: పొన్నం ప్రభాకర్

ABOUT THE AUTHOR

...view details